త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా అతడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఖలేజా మాత్రం దారుణంగా నష్టపోయింది. ఇక మళ్ళీ చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ మహేష్ ఒక బిగ్ మూవీతో రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ మళ్ళీ ఖలేజా తరహాలోనే కష్టాలు ఎదురవుతున్నాయి.
ఖలేజా సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా హడావిడిగా కనిపించింది. అయితే నిర్మాత ఆర్థిక కారణాల వలన ఆ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఏడాది సమయం కూడా వృధా అయ్యింది. అయితే ఖలేజాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 వ ప్రాజెక్టుకు మాత్రం ఇతర కారణాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ముఖ్యంగా నటీనటుల డేట్స్ తో పాటు టెక్నీషియన్స్ షెడ్యూల్స్ కూడా క్లాష్ అవుతున్నాయి.
అసలైతే ముందుగా త్రివిక్రమ్ అనుకున్న ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ స్క్రిప్ట్ విషయంలో మహేష్ కాస్త కఠినంగా ఉండడంతో ఈ సినిమా మొదటి షెడ్యూల్ కు చాలా సమయం పట్టింది. దానికి తోడు వెంట వెంటనే మహేష్ ఫ్యామిలీలో విషాదలు చోటు చేసుకోవడం కూడా ఈ ప్రాజెక్టుకు ఇబ్బందిగా అనిపించాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అలాగే ఇతర నటీనటుల డేట్స్ అన్ని కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Follow
Post a Comment