అసలు భవదీయుడు ఎందుకు సెట్టవ్వలేదంటే?

 


హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ముఖ్యంగా హరీష్ శంకర్ అయితే తన తదుపరి ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నాను అంటూ గత మూడేళ్ల నుంచి చెబుతున్నాడు. అయితే ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టు కూడా మళ్ళీ క్యాన్సిల్ అయింది. అయితే భవదీయుడు భగత్ సింగ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది హాట్ టాపిక్ గా మారింది.


ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టును తొందరగానే మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం తొందరగా ఫినిష్ చేయాలని భీమ్లా నాయక్ కు షిఫ్ట్ అవ్వడం, ఇక మధ్యలో స్క్రిప్ట్ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా కొంత ఆలోచనలో పడింది. కొన్ని మార్పులు చేర్పులు అవసరమని కూడా అనుకున్నారు. కానీ ఎంతకీ అది సెట్ అవ్వకపోవడంతో హరీష్ శంకర్ మరో కథ గురించి చెప్పాడు. ఇక అది నచ్చడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు అనుకున్న ప్రాజెక్టు క్యాన్సిల్ చేసి కొత్త తరహా స్క్రిప్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు తేరి రీమిక్ అని అంటున్నారు కానీ ఆ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post