మహేష్ తో సినిమా.. అనిల్ కామెంట్!

 


డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన తర్వాత మరో సినిమా చేయాలని అనుకున్నాడు. అసలైతే సర్కారు వారి పాట సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టు ఉంటుంది అని అనుకున్నారు. కానీ మహేష్ బాబు మరొక విధంగా ప్లాన్ చేసి అనిల్ ప్రాజెక్టును పక్కన పెట్టేసాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.


మహేష్ బాబు తో ఎప్పుడైనా సరే సినిమా చేయడానికి రెడీ. కానీ ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమాకు మరో రెండేళ్ల సమయమైన టైం పట్టవచ్చు. కాబట్టి ఇప్పట్లో అయితే ఆయనతో సినిమా చేసే సమయం అయితే దొరకదు అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఆయన ఎప్పుడు రెడీ అన్నా సరే నేను సినిమా చేస్తాను అని అనిల్ అన్నాడు. కానీ మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత పాన్ ఇండియా ఆలోచన విధానంతో దర్శకుల సెలక్షన్ విషయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ రేంజ్ లో అనిల్ కథను చెబుతాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post