టెలివిజన్ స్టార్స్ బాక్సాఫీస్ మోత

 

ఇటీవల కాలంలో టెలివిజన్ స్టార్స్ కూడా మంచి గుర్తింపు అందుకుంటున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం టెలివిజన్ నుంచి వచ్చి వెండితెరపై కనిపించిన వారు అంతగా గుర్తింపును అందుకునే వారు కాదు అనే సెంటిమెంట్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొందరు కథానాయకులుగా కూడా రానిస్తూ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నారు. యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో మొదటి రోజే 3 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.


ఇక యాంకర్ ప్రదీప్ తర్వాత మళ్లీ సుడిగాలి సుదీర్ కూడా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. అతను నటించిన గాలోడు సినిమా శుక్రవారం విడుదలై మొదటి రోజే కోటికి పైగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చిన అంశం. మాస్ బీ,సీ సెంటర్లలో సినిమాకు మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక శనివారం కూడా కొంత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాకు పోటీగా మరో హారర్ మూవీ మసూద మంచి కలెక్షన్లు అందుకునే అవకాశం కూడా ఉంది. శని, ఆదివారాల కలెక్షన్స్ బట్టి ఈ సినిమా ప్రాఫిట్ లోకి వస్తుందో లేదో అర్ధమవుతుంది.

Post a Comment

Previous Post Next Post