నమ్ముకున్న డ్రైవర్ కు బన్నీ సహాయం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ గుణంలో కూడా చాలా మంచివాడు అని చాలాసార్లు రుజువు చేశాడు. ఇక రీసెంట్ గా అతను కేరళలోని ఒక అమ్మాయి చదువు కోసం ఎవరికీ తెలియకుండా హెల్ప్ చేసిన విధానంపై అక్కడి కలెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే బన్నీ తన దగ్గర పనిచేసే వారికి కూడా ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు అని మరోసారి నిరూపించాడు.


తన దగ్గర దాదాపు 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక డ్రైవర్ కు ఇల్లు కట్టుకునేందుకు బన్నీ సహాయం చేశాడు. వరంగల్ కు చెందిన మహిపాల్ దాదాపు పదేళ్ళ నుంచి బన్నీ దగ్గరే పర్సనల్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. ఎల్లప్పుడూ బన్నీకి ఒక బాడీగార్డ్ లో కూడా అతను వెళుతూ వస్తున్నాడు. అయితే అతనికి బోరబండలో ఇల్లు కట్టుకునేందుకు బన్నీ 15 లక్షల రూపాయలు వరకు సహాయం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post