అడివి శేష్.. నాని ఎన్ని కోట్లు ఇచ్చాడు?

 


టాలెంటెడ్ హీరో అడివి శేష్ చిన్న సినిమాల నుంచి ఇప్పుడు మెల్లగా తన రేంజ్ ను పెంచుకునే విధంగా సినిమాలు చేస్తున్నాడు. మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చేస్తున్నాడు. చివరిగా అతను చేసిన మేజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు తన భవిష్యత్తు ప్రాజెక్టులకు అంతకంటే ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


ఇక నాని ప్రొడక్షన్ లో చేసిన HIT 2 సినిమా కోసం అడవి శేష్ అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతగా నాని మారిన తర్వాత ఒక హీరోకు ఇచ్చిన అత్యధిక రెమ్యూనరేషన్ కూడా ఇదే. ఇక భవిష్యత్తులో ఈ సినిమాకు కొనసాగింపుగా HIT 3 రాబోతోంది. అందులో అడవి శేష్ తోపాటు నాని కూడా నటిస్తున్నాడు. అలాగే విజయ్ సేతుపతిని కూడా రంగంలోకి దింపుతున్నారు. కాబట్టి నాని మరింత ఎక్కువ స్థాయిలో పారితోషికాలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఎంతవరకు డీల్స్ సెట్ చేసుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post