అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీశాడు. అనంతరం జాంబిరెడ్డి సినిమాతో కూడా అతను బాగానే మెప్పించాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా హనుమాన్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలవుగా కంటెంట్ కంటే కూడా ఆదిపురుష్ కారణంగా ఈ సినిమా చాలా హైలైట్ అవుతుంది.
ఆశ్చర్యపరచెంత కంటెంట్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొన్ని విజువల్ షాట్స్ మాత్రం పరవాలేదు అనే విధంగా ఉన్నాయి. అయితే అవి ఆదిపురుష్ కంటే కాస్త మెరుగ్గా ఉండటంతో ఇప్పుడు అందరూ ఆదిపురుష్ పై పడిపోయారు. 15 కోట్లతోనే ప్రశాంత్ అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చాడు అని, 550 కోట్లతో ఆదిపురుష సినిమా కోసం అలాంటి దారుణమైన గ్రాఫిక్స్ ఎలా వాడారో అర్థం కావడం లేదు అని నేటిజన్స్ ఊహించని స్థాయిలో నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ ద్వారానే ఇప్పుడు హనుమాన్ సినిమా ఎక్కువగా హైలైట్ అవుతుంది. దర్శకుడు ఓం రావత్ ను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా చిన్న సినిమాకి పాన్ ఇండియా రీచ్ కు ఇది బాగా కలిసొచ్చే అంశమే..
Follow
Post a Comment