మహేష్ బాబు త్రివిక్రమ్ మొదట అనుకొన్న కథ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ సరికొత్తగా మరొక కథను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాన్సిల్ అయిన షూట్ ద్వారా నిర్మాతలు కొంత ఎక్కువగానే నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమని భారీ సెట్ ను నిర్మించడమే కొంతమంది అనుభవం ఉన్న కాస్ట్లీ ఫైటర్స్ ను కూడా షూటింగ్లోకి తీసుకువచ్చారు. దాదాపు రెండు వారాలపాటు ఆ షెడ్యూల్ కొనసాగింది.
అయితే షెడ్యూల్ కోసం పెట్టిన ఖర్చుతో ఒక మంచి అవుట్ పుట్ తో చిన్న సినిమాను తెరపైకి తీసుకురావచ్చు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ద్వారా లీక్ అయిన సమాచారం ప్రకారం అందుకోసం త్రివిక్రమ్ దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చు చేయించినట్లుగా తెలుస్తోంది. KGF ఫేమ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ ఆధ్వర్యంలో యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగానే వచ్చినప్పటికీ కూడా కథపై మహేష్ సంతృప్తిగా లేకపోవడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇక మళ్ళీ మరో కొత్త కథతో మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ డిసెంబర్ లో స్టార్ కాబోతోంది.
Follow
Post a Comment