విజయ్ - దిల్ రాజు.. కక్కలేక మింగలేక!


తమిళ హీరో విజయ్ సినిమా ప్రపంచంలో 300 కోట్లకు పైగా మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇంకా తెలుగు మార్కెట్ పై మాత్రం అతను పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోతున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా వారసుడు సినిమాతో సెట్ అవ్వాలి అని అనుకున్నాడు. అందుకే అతను ఇంతకుముందు కొంతమంది తెలుగు నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఎవరికీ ఒప్పుకోలేదు.

దిల్ రాజు మాత్రమే పర్ఫెక్ట్ అని అనుకున్నారు. అందుకే ఆయన వంశీ పైడిపల్లిపై పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా దిల్ రాజు మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఒప్పుకున్నాడు. కొరటాల శివ లాంటి దర్శకుడికి రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో డిజాస్టర్ ఎదుర్కోకతప్పలేదు. ఇక దాదాపు వంశీ పైడిపల్లి సినిమాల కమర్షియల్ ఫార్ములాలు కూడా అదే తరహాలో ఉంటాయి. కాబట్టి అతని కూడా ఎప్పుడో ఒకప్పుడు మాత్రం దారుణంగా డిజాస్టర్ ఎదురయ్యే ఛాన్స్ లేకపోలేదు

అయితే ఇప్పుడు తెలుగులో అసలు వారసుడు సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనేది టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే తమిళంలో ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా థియేటర్ల లెక్కలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం కారణంతో ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ ఛాన్స్ లేదు. అలా జరిగితే సినిమా బిజినెస్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉండదు. 

పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అంటే ఎక్కువ థియేటర్లలో పండగ సీజన్లో విడుదల చేస్తేనే బెటర్. తమిళంలో ఎలాంటి టెన్షన్ లేదు కానీ తెలుగులో మళ్ళీ తర్వాత విడుదల చేస్తే ఏమాత్రం బాగుండదు. పోనీ తమిళ్ తెలుగులో వాయిదా వేద్దామని అనుకుంటే తమిళ లో సంక్రాంతి టైంలో విజయ్ సినిమాలకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అక్కడ వాయిదా వేస్తే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టైంలో అటు తమిళంలో వాయిదా వేయలేక.. ఇటు తెలుగులో విడుదల చేయలేక దిల్ రాజు, విజయ్ ఇప్పుడు కక్కలేక మింగలేక.. అనే అనేలా కన్ఫ్యూజన్ లో పడ్డారు.

Post a Comment

Previous Post Next Post