NTR 30: అనిరుధ్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్

 


యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడు కొరటాల శివ కూడా ప్రత్యేకంగా చెన్నై వెళ్లి మరి ఈ కంపోజర్ తో స్క్రిప్ట్  పై చర్చలు జరిగాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమాకు దాదాపు అందరి పారితోషికాలు హై రేంజ్ లో ఉంటాయని అర్థమవుతుంది.


ఇక అనిరుద్ ఈ సినిమాతో కూడా సాలిడ్ రెమ్యునరేషన్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు అతను మూడు నుంచి 4 కోట్లలోపే రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చాడు. అయితే ఈసారి NTR 30 సినిమా నుంచి ఐదు కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది ఓకే అయితే అతని కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాకు అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post