SSMB 29: అప్పుడే విలన్ ఫిక్స్ అయ్యాడా?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా రాబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో అయితే స్క్రిప్ట్ సిద్ధం కాలేదు ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు గ్రాఫిక్స్ కు సంబంధించిన ప్లానింగ్ కూడా రెడీ చేసుకుంటున్నాడు.

అయితే ఈ తరుణంలోనే విలన్ క్యారెక్టర్ ఫిక్స్ అయినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీనే విలన్ గా దర్శకుడు రాజమౌళి ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు అని సోషల్ మీడియాలో ఒకటాక్ అయితే వినిపిస్తోంది. కానీ నిజానికి రాజమౌళి ఇంకా నటీనటుల విషయంలో అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో కథ సిద్ధమైతేనే ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది. ఇక SSMB 29 షూట్ వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ కానుంది.

2 Comments

Post a Comment

Previous Post Next Post