ప్రిన్స్ మూవీ - రివ్యూ & రేటింగ్

 


కథ
ఆనంద్(శివ కార్తికేయన్) ఒక స్కూల్ టీచర్ గా తన గ్రామంలోనే అల్లరిగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు అతని తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) మాత్రం ఒకవైపు కొడుకుకి ఫ్రీడమ్ ఇస్తూనే మరొకవైపు బాధ్యతగా ఉండాలి అని అంటుంటాడు. అలాగే కులమత బేధాలు లేకుండా ఉండాలి అని గ్రామ పెద్దగా కొనసాగుతూ ఉంటాడు. అయితే ఆనంద్ స్కూల్లోనే మరొక టీచర్ గా వచ్చిన విదేశీ అమ్మాయి జెస్సికతో (మరియా ర్యాబోషప్కా) ప్రేమలో పడతాడు. ఇక తర్వాత జెస్సి బ్యాక్ గ్రౌండ్ తెలిసిన ఆనంద్ తండ్రి వారి పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోడు. అలాగే మరోవైపు జెస్సిక తండ్రి కూడా ఇండియన్స్ మొత్తం మీద కోపం పెంచుకుంటాడు. ఇక తర్వాత ఆనంద్ ను ఉరి నుంచి పంపించాలని డిమాండ్ వస్తుంది. ఇక ఆనంద్ తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి పాట్లు పడ్డాడు అలాగే జెస్సికా తండ్రికి వచ్చిన కష్టం ఏంటి ఇక వాటన్నిటిని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..


విశ్లేషణ
తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైన ప్రిన్స్ సినిమాను జాతిరత్నం ఫేమ్ అనుదీప్ తెరకెక్కించడంతో తెలుగు ప్రేక్షకులు అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తమిళంలో శివ కార్తికేయనన్ కు మంచి హీరో అనే బ్రాండ్ ఉంది కాబట్టి అక్కడ భారీ స్థాయిలోనే విడుదలైంది. ఇక దర్శకుడు అనుదీప్ ఈసారి పూర్తి కామెడీ కాకుండా ఒకవైపు లాజిక్స్ తోనే కథను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కామెడీ లవ్ అలాగే ఒక మెసేజ్ అనే ఫార్మాట్లోనే సినిమాను తీసుకువెళ్లాడు. ఎక్కువగా మాత్రం తన కామెడీ టైమింగ్ విడిచిపెట్టలేదు. ఇక లాజిక్స్ తో సంబంధం లేకుండా వచ్చే కామెడీ ఎపిసోడ్స్ అయితే ఈ సినిమాల్లో కూడా చాలానే ఉన్నాయి. అయితే జాతి రత్నాలు రేంజ్ లో అయితే ఆ కామెడీ సన్నివేశాలు పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు.

ఇక నటీనటులలో అయితే తెలుగువారు ఇందులో ఎవరు లేరు. సత్యరాజ్ తెలిసినప్పటికీ కూడా ఆయన తండ్రి పాత్రలో కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ అది తెలుగువారికి అయితే పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కట్టప్ప లాంటి పవర్ఫుల్ పాత్రలో చూసినా ఆయనను అలా ఫుల్ లెన్త్ కామెడీ పాత్రలో తెలుగు వారికి కనెక్ట్ చేయడం అంటే పెద్ద మైనస్ చెప్పాలి. ఇక శివ కార్తికేయన్ అయితే ఈ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరవుతాడు అని చెప్పవచ్చు. అతని కామెడీ టైమింగ్ బాడీ లాంగ్వేజ్ అలాగే లవ్ సీన్స్ లో అతని అమాయకత్వం కూడా సినిమాలో హైలెట్ అయింది.

ఇక డాన్స్ లో కూడా అతను తన స్టైల్ హైలెట్ అయ్యే విధంగా స్టెప్పులు వేశాడు. దర్శకుడు అనుదీప్ ఈ సినిమాలో చిన్నపాటి కామెడీ సన్నివేశాలను ఒక పెద్ద సన్నివేశాలలో హైలైట్ చేయగలనుకున్న విధానం అన్ని సార్లు ఆసియేన్స్ కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో పరవాలేదు అనిపించింది. ఇక జెస్సిక అనే పాట తప్పితే మిగతా పాటలు అంతగా ఏమీ వర్క్ కాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చిన ఒక సాంగ్ కూడా అంతగా ఏమీ వర్కౌట్ కాలేదు. అసలు ఆ పాట సినిమాల అవసరం లేదు అని కూడా అనిపిస్తుంది.

ఏదేమైనా కూడా దర్శకుడు జాతి రత్నాలు రేంజ్ లో అయితే ప్రిన్స్ సినిమాను ప్రజెంట్ చేయలేకపోయాడు. కేవలం శివకార్తికేయన్ టైమింగ్ అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలతో పరవాలేదు అనిపించాడు. ఇక చివరలో శివ కార్తికేయన్ ఒక మంచి మెసేజ్ ఇచ్చే డైలాగ్స్ తో అయితే పరవాలేదు అనిపించాడు. సీరియస్ సన్నివేశాలలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం అక్కడక్కడ ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది. ఇక ప్రిన్స్ సినిమా టైటిల్ కు కథకు ఎక్కడ కూడా పెద్దగా సంబంధం లేదు. ఫైనల్ గా ప్రిన్స్ సినిమాలను పెద్దగా అంచనాలు లేకుండా శివకార్తికేయన్  కోసం చూడవచ్చు. కానీ జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ పై అంచనాలు పెంచుకొని వెళ్తే మాత్రం తీవ్రంగా నిరాశ పడడం ఖాయం.

ప్లస్ పాయింట్స్
👉శివకార్తికేయన్ కామెడీ
👉లవ్ సీన్స్
👉క్లయిమ్యాక్స్ లో కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్
👉ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ సీన్స్
👉కథకు సంబంధం లేని ఎపిసోడ్స్
👉సెకండ్ హాఫ్ సాంగ్

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post