జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలాకాలం అయింది కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలు కాలేదు. కథలో ఏదో మార్పులు చేస్తున్నట్లు కూడా రకరకాల రూమర్లు అయితే అభిమానులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో అయితే ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పలేదు.
అయితే రీసెంట్ గా రష్మిక మందన్న ముంబైలో తన తదుపరి సినిమా గుడ్ బై సినిమా ప్రమోషన్లో ఎన్టీఆర్ సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అయితే చర్చల దశలో ఉంది. ఇక రష్మిక మందన్న కూడా ఆ సినిమా కోసం ఇప్పటికే అప్రోచ్ అయినట్లుగా వివరణ అయితే ఇచ్చింది కానీ ఇంకా అధికారికంగా ఇప్పుడే చెప్పలేను అని తెలిపింది. ఇక ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మాత్రం ఈ బ్యూటీ తెలియజేసింది.
Follow
Post a Comment