అల్లు అరవింద్ ఇటీవల అలీతో సరదాగా టాక్ టాక్ షోలో రామ్ చరణ్ - అల్లు అర్జున్‌లతో మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. అలాగే అతను 'చరణ్ అర్జున్' అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసి, చాలా సంవత్సరాలుగా హీరోలకు తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు హీరోల సూపర్‌స్టార్‌డమ్‌ని హ్యాండిల్ చేయగల దర్శకుడు, కథనం లేకపోవడంతో ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక్క అంగుళం కూడా కదలలేకపోయిందని అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవడు సినిమాలో కలిసి నటించినా ఆ సినిమా కాన్సెప్ట్ కారణంగా ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించలేకపోయారు. అప్పటి నుండి పరిస్థితులు చాలా మారాయి. రామ్ చరణ్ తన విజయవంతమైన చిత్రాలతో అతిపెద్ద స్టార్‌లలో ఒకరడిగా RRR తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ కూడా పుష్పతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. దీంతో వీరి కలయికలో మల్టీస్టారర్ అంటే అంచనాలు మాములుగా ఉండవు. మరి భవిష్యత్తు లో ఎవరైనా దర్శకుడు వీరి కోసం కథ సిద్ధం చేస్తాడో లేదో చూడాలి.
Follow
Post a Comment