ఈ ఏడది అక్కినేని హీరోలకు ఏ మాత్రం కలిసి రాలేదు. మొదట్లో బంగార్రాజు సినిమాతో సంక్రాంతి హడావిడిలో ఏదో కమర్షియల్ హిట్ కొట్టేసారు. కానీ అది కూడా పూర్తిస్థాయిలో లాభాలను అయితే అందించలేదు. ఇక ఆ తర్వాత నాగచైతన్య థాంక్యూ అనే సినిమాతో వచ్చాడు. ఆ సినిమా దాదాపు 20 కోట్ల వరకు నష్టాలను కలిగించింది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విడుదలకు ముందు హైప్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక రీసెంట్ గా నాగార్జున అయితే ది ఘోస్ట్ సినిమాతో విడుదలకు ముందు కాస్త హడావిడి చేశాడు. తప్పకుండా సినిమా దసరా పోటీలో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా అందరూ అనుకున్నారు. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో మొదటి వారంలోనే థియేటర్స్ చాలావరకు తగ్గిపోయాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా దాదాపు 15 కోట్ల వరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ బాబు అయినా రాబోయే ఏజెంట్ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Follow
Post a Comment