ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ ను అభిమానులకు నచ్చినట్లుగానే హై వోల్టేజ్ వైబ్రేషన్స్ తో ప్రజెంట్ చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాలో అఖండ, కార్తికేయ 2 తరహాలోనే ఒక డివోషనల్ టచ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే అది కూడా పూర్తిగా ప్రశాంత్ నీల్ స్టైల్ కు తగ్గట్టుగానే ఉండబోతుందట. సలార్ సెకండ్ హాఫ్ లో పూర్తిస్థాయిలో కాళీమాతకు సంబంధించిన ఒక డివోషనల్ టచ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచి యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ కాళికామాత ఉగ్రరూపం తరహాలో విలన్స్ ను ఊచకోత కోస్తాడు అని టాక్. ఇక ఈ సినిమా రెండు భాగాలుగానే తెరపైకి రాబోతున్నట్లు లేటెస్ట్ గా మరో సమాచారం అందింది. ఇక మొదటి భాగాన్ని 2023 సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు.
Follow
Post a Comment