బాలయ్య, చిరు.. మైత్రి పవర్ఫుల్ అప్డేట్స్!


కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి రానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. ప్రస్తుతం అయితే జనవరి 11న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చే అవకాశం ఉందట.  దీపావళి వారాంతంలో టైటిల్ ఆలాగే విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

అలాగే మైత్రి మూవీ మేకర్స్ నందమూరి బాలకృష్ణ 107 వ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న ఈ హైవోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్‌తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నారు. ఇక ఈ శనివారం సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. సినిమాకు వీరసింహా రెడ్డి అనే మరో టైటిల్ చర్చలో దశలో ఉంది. ఇక సినిమాను జనవరి 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post