ఎన్టీఆర్.. మరో రెండేళ్ళు పోయినట్లే?


జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. మార్చిలో RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఇంకా తన రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు. షూటింగ్ స్టార్ట్ కావడానికి మరో మూడు నెలల సమయం కూడా పట్టవచ్చట. దర్శకుడు ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయలేదని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ ఒక వేళ ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేసినా కూడా షూటింగ్ కోసం మినిమమ్ ఒక ఏడాది టైమ్ అయినా పట్టవచ్చు. ఇక 2022 RRR మార్చిలో విడుదలైంది కాబట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి షూటింగ్ సగం కూడా అయిపోకపోవచ్చు. ఇక ఆ తరువాత 2024 మార్చి లోపల సినిమా రావచ్చు. అంటే దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ సమయం వరకు ఎన్టీఆర్ బొమ్మ వెండితెరపై కనిపించే అవకాశం లేదని అనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post