గ్యాప్ లో జేబులు నింపుకుంటున్న బన్నీ, త్రివిక్రమ్!


మహేష్ బాబుతో త్రివిక్రమ్ కొత్త సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యింది. ఇక మరో షెడ్యూల్ ను దసరా అనంతరం స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ బాబు తల్లి మరణించడంతో మళ్ళీ రెండు వారాలు ఆలస్యంగా SSMB28 షూట్ స్టార్ట్ కావాల్సి ఉంది. 

ఇక ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ తో కలవబోతున్నాడు. త్రివిక్రమ్ ఇప్పుడు ఒక చిన్న టీవీ కమర్షియల్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకట్టాడు. వారు ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనల కోసం పనిచేశారు. ఈసారి వారు జోమాటో కోసం ఒక ఫన్నీ ఇంకా యాక్షన్ తరహాలో షూట్ చేయబోతున్నారు. ఇది బన్నీ చాలా కాలం క్రితమే సంతకం చేసింది. ఇక వారం రోజుల్లో ఆ వర్క్ ను ఫినిష్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ యాడ్ ద్వారా బన్నీతో పాటు త్రివిక్రమ్ కూడా హై రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు.

Post a Comment

Previous Post Next Post