లైగర్ గొడవ.. ఒక్కో ఏరియాలో ఎంత లాస్ అంటే?


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా నష్టపోయినందుకు ఎంతో కొంత డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 27న పూరి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ అయితే ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక లైగర్ సినిమా తెలుగు మార్కెట్ వరకు ఏ ఏరియాలో ఏంత నష్టపోయిందంటే.. నైజాం 19 కోట్లు, సీడెడ్ లో 7.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.05 కోట్లు, ఈస్ట్ లో 4.20 కోట్లు, వెస్ట్ 3.20 కోట్లు, గుంటూరు 3.80 కోట్లు, మొత్తం ఆంధ్ర తెలంగాణాలో 62 కోట్ల వరకు బిజినెస్ చేసిన లైగర్ దాదాపు 48 కోట్ల వరకు నష్టాలు కలుగజేసింది. తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో కూడా నష్టాలపాలైన ఈ సినిమా నార్త్ ఇండియాలో మాత్రమే 10 కోట్ల బిజినెస్ కు 9 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 60 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post