అక్కినేని ఫ్యాన్స్ కు ఈ ఏడాది వరుసగా నిరాశాలు ఎదురయ్యాయి. బంగార్రాజు పరవాలేదు అనిపించినప్పటికి ఆ తరువాత నాగచైతన్య థాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఆ తరువాత నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో డిజాస్టర్ అవుతోంది.
ఇక అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా అఖిల్ ఏజెంట్ సినిమా పైనే ఉన్నాయి. ఆ సినిమాను మొదట ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక షూట్ ఆలస్యం అవుతుండడంతో 2023 జనవరి కి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ స్లాట్ నిండిపోయింది. కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ కు రావచ్చు. కానీ ఈ లోపు సినిమా పై ఉన్న హైప్ మెల్లగా తగ్గే అవకాశం ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎదో ఒక అప్డేట్ తో మళ్ళీ హైప్ పెంచాలి. అసలే పాన్ ఇండియా అంటున్నారు. ఈ రకంగా వాయిదాలు చేసుకుంటూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుంటే మొదటికే మోసం వస్తుంది.
Follow
Post a Comment