2023 సంక్రాంతి టార్గెట్ చేస్తూ చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముందుగా అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా కూడా అదే సమయానికి తెలుగు తమిళ్లో విడుదల కాబోతోంది. ఇక పోటీగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా రావచ్చు అని అందరూ అనుకున్నారు.
నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేయడంతో ఈ క్లాష్ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ స్థానంలో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే NBK107, వాల్తేరు వీరయ్య సినిమాలను మైత్రీ మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య పనులు అప్పటికి పూర్తయ్యే అవకాశాలు లేవని ముందుగానే NBK107 ను సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ ఫ్లాన్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.
Follow
Post a Comment