ఆదిపురుష్ టీజర్.. ఎప్పుడైనా ఈ టెక్నాలజీతో రిస్కే!


ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి అర్థం కావడం లేదు. యానిమేషన్, కార్టూన్, గ్రాఫిక్స్ ఎటు కాకుండా ఉందేంటి అని ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.
ఈ సినిమాను 3D మోషన్ క్యాప్చర్ యానిమీట్ మొవీగా తీయాలని అనుకున్నారు. అవతార్ టైప్ లో 3D గ్రాఫిక్స్ ఉంటాయని అందరూ అనుకున్నారు. 

కానీ అంచనాలు రివర్స్ అయ్యాయి. గతంలోనే కొచ్చాడియన్ తో ఈ తరహా రిస్క్ చేసి దెబ్బ తిన్నారు. ప్రభాస్ లుక్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు వానర సైన్యం, మిగతా రాక్షస పక్షులను, బాణాలను, సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా చాలా దారుణంగా గ్రాఫిక్స్ ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం రావణాసుర 10 తలల షాట్ కూడా కరెక్ట్ లేదని కామెంట్స్ వస్తున్నాయి. 500 కోట్ల ప్రాజెక్ట్ కు ఈ గ్రాఫిక్స్ ఏమిటి అని సందేహాలు ఇప్పుడు ఎక్కువయ్యాయి.

Post a Comment

Previous Post Next Post