ప్రిన్స్ అనుదీప్.. బడా సంస్థల అలెర్ట్!

 


జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ ఒక విధంగా ఆ సినిమాలో నటించిన వారికంటే హై రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా తీశాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అనుదీప్ ఫ్యాన్స్ అంచనాలను టచ్ చేయలేకపోయింది.


అయితే అనుదీప్ జాతిరత్నాలు స్టైల్ లో ట్రై చేసిన కామెడీ ప్రిన్స్ లో అయితే వర్కౌట్ కాలేదు. ఇక అనుదీప్ తదుపరి సినిమాలను రెండు బడా ప్రొడక్షన్ హౌస్ లలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో కూడా సినిమా చేయాల్సి ఉంది. హీరో ఎవరనేది ఫిక్స్ కాలేదు కానీ నిర్మాణ సంస్థలు మాత్రం రొటీన్ కామెడీ జానర్ లో కాకుండా కొత్త కాన్సెప్ట్ లోనే సినిమాలు చేయాలని సలహాలు ఇస్తున్నారట. అడ్వాన్స్ తీసుకున్న అనుదీప్ ముందుగా మైత్రి మేకర్స్ లో సినిమా చేసేందుకు కథ సిద్ధం చేయనున్నాడు. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post