సంక్రాంతికి 4 సినిమాలు.. 250 కోట్లు?

 


2023 సంక్రాంతి కి ఈసారి ఒకేసారి 5 సినిమాలు వస్తాయని అనుకున్నప్పటికి 4 వినిమాలు మాత్రమే పోటీలోకి దిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసుకోగా ఆ తరువాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ఫిక్స్ అయ్యింది. ఇక ఏజెంట్ కూడా అప్పుడే రాబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ ఫైట్ లో అందరికంటే ఎక్కువగా బాలకృష్ణ హాట్ టాపిక్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ సినిమా 70 నుంచి 80 కోట్ల మధ్యలో థియేట్రికల్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక మెగాస్టార్ వాల్తేరు వీరయ్య థియేట్రికల్ గా 80 కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చు. ఇక ఇక పోటీలో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ 60 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేయవచ్చని తెలుస్తోంది. ఇక విజయ్ వారసుడు తెలుగులో 20 కోట్ల కు పైగా బిజినెస్ చేయవచ్చు. అంటే కేవలం టాలీవుడ్ లోనే దాదాపు 240 లేదా 250 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. మరి ఏ సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post