కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసు దాటిన కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 169వ సినిమా జైలర్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ 175 మార్క్ అందుకోవడానికి మళ్లీ స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది.
రీసెంట్ గా మరో మూడు ప్రాజెక్టులు చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా లైకా ప్రొడక్షన్ లోనే ఆయన రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇక అందులో ఒక సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించే అవకాశం ఉందట. అలాగే మరొక యువ దర్శకుడితో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇక తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో కూడా ఒక సినిమా చేయాలి అని సూపర్ స్టార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow
Post a Comment