మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న బిగ్ బడ్జెట్ మూవీ SSMB28పై అంచనాలు రోజు రోజు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కలు కూడా షూటింగ్ మొదలవక ముందే మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ రకరకాలుగా ఆలోచించినట్లు కథనాలు అయితే వెలబడ్డాయి.
ముఖ్యంగా ఇటీవల జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఫిక్సయినట్లు కూడా సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ వైరల్ అయింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే సెకండ్ హీరోయిన్ ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో కేవలం పూజా హెగ్డే మాత్రం మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు ఆ సంస్థ సన్నిహితులు చెబుతున్నారు. ఇక సినిమా షూటింగ్ తో ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని మహేష్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు.
Follow
Post a Comment