కథ:
ఆదిత కరికాలన్ (విక్రమ్), వల్లవరయ్య (కార్తీ) పాత్రలతో మొదలయ్యే అసలు కథలో చోళ వారసుడిని చంపడానికి కుట్ర గురించి తెలుసుకోవడానికి కరికాలన్ ప్లాన్ వేస్తాడు. అందుకోసం వల్లవరయ్యను రంగంలోకి దింపగా అతను చోళ రాజ్యం మీదుగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అనంతరం అరుణ్‌మొళి (జయం రవి)పై వేసిన ప్లాన్ ఏమిటి? వల్లవరయ్య చోళ వరాసుడికి సంబంధించిన కీలక అంశాలను ఎలా తెలుసుకున్నాడు అనేది పొన్నియన్ సెల్వన్ యొక్క ప్రధాన కథాంశం.
విశ్లేషణ:
లెజెండరీ మేకర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు మొదటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమా బాహుబలి అంచనాలను అందుకుంటుంది అనే తరహాలో కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందా లేదా అనే విశ్లేషణ లోకి వెళితే.. మొదట ఈ సినిమాలో పాత్రల గురించి మాట్లాడుకోవాలి. భారీ క్యాస్టింగ్ తో దర్శకుడు సన్నివేశాలను మరో లెవెల్ కు తీసుకువెళ్లాలని బాగానే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ అవసరమయ్యే పాత్ర మాత్రం కార్తీదే అని చెప్పాలి. ఈ సినిమా కథను దర్శకుడు రచయిత కల్కి రాసిన పుస్తకం ఆధారంగా తెరపైకి తీసుకువచ్చినట్లు ముందుగానే తెలియజేశారు.
ఇక వారియర్ కింగ్ ఆదిత కరికాలన్ పాత్రలో విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అద్భుతంగా ఉన్నాడు. కార్తీ వల్లవరయ్యగా పాత్రకు పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పవచ్చు. అతని బాడీ లాంగ్వేజ్ అలాగే యాక్షన్ సీన్స్ లో బాగానే హార్డ్ వర్క్ చెశ్వడు. పొన్నియిన్ సెల్వన్ -1లో నందినిగా ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటించగా.. త్రిష పాత్రను ఇతరులతో పోలిస్తే బలహీనమైనది అనిపిస్తుంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం పొన్నియిన్ సెల్వన్ తమిళ సంస్కృతికి బాగా దగ్గరగా ఉంది.
పాత్ర పేర్లు, స్థలాలు డ్రెస్సింగ్ ప్రతిదీ తమిళ చరిత్రను ప్రతిబింబిస్తుంది. బాహుబలి రేంజ్ లో పాన్ ఇండియా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. ఇక పాత్రలు కథ బాగానే ఉన్నా బలాన్ని చేకూర్చే సన్నివేశాలు మాత్రం పెద్దగా లేవు. అక్కడక్కడా కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి. కథ ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, సన్నివేశాలు ఆశించిన ప్రభావాన్ని చూపలేదు. మణిరత్నం మేకింగ్ విధానంలో పెద్దగా మ్యాజిక్ ఏమి క్రియేట్ అవ్వలేదు. దాదాపు ఇంటర్వెల్ మార్క్ కు వచ్చేసరికి సినిమా మొత్తం చూసిన అనుభూతి కలుగుతుంది.
అసలు డ్రామా ప్రారంభమైన తర్వాత చాలా స్లోగా కొనసాగుతున్న భావన కలుగుతుంది. సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా వావ్ అనే రేంజ్ లో సన్నివేశాలు లేవు. ఇక చివరి అరగంట క్లయిమాక్స్ లో మాత్రమే కొంత ఆసక్తిని కలిగిస్తుంది. ఒక విధంగా పార్ట్ 2 పై కూడా కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. మొత్తంగా పొన్నియన్ సెల్వన్ -1 కథకు కట్టుబడి తెరపైకి తీసుకు వచ్చారు అనిపిస్తుంది. కానీ యాక్షన్ హై వోల్టేజ్ వార్ సీన్స్ ఉంటాయని కోరుకునే ఆడియెన్స్ కు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడం కష్టమే. ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఏఆర్.రెహమాన్ మ్యూజిక్ పరవాలేదు. కెమెరా పనితనం సెట్స్ ఆర్ట్ వర్క్ మెచ్చుకోదగిన అంశాలు.
ప్లస్ పాయింట్స్:
👉కథ
👉స్టార్ క్యాస్టింగ్
👉ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్:
👉నీరసంగా కొనసాగే ఎపిసోడ్స్
👉మణిరత్నం రొటీన్ స్క్రీన్ ప్లే
👉వావ్ అనిపించే సీన్స్ లేవు
రేటింగ్: 2.5/5
Follow
Follow
Post a Comment