విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత అందరి దృష్టిలో పడిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్ట్ తో పవర్ఫుల్ గా రెడి కానున్నాడు. ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను ఇళయతలపతి విజయ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
టాక్ ప్రకారం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన విలన్ పాత్ర కోసం ఎంచుకున్నారట. సంజయ్ దత్ ఇటీవలే KGF: చాప్టర్ 2 లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు.
సంజయ్ దత్ కు కథ చెప్పగానే పాత్రను ఇష్టపడ్డాడని లోకేష్ కనగరాజ్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నటుడు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. పాన్-ఇండియన్ సినిమాగా షూటింగ్ ను నవంబర్‌లో ప్రారంభమవుతుంది. విజయ్ ప్రస్తుతం వారసుడు షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. ఆ మూవీ జనవరి 2023లో విడుదల కానుంది.
Follow
Follow
Post a Comment