ఇటీవల కాలంలో స్టార్ హీరోలు పుట్టినరోజుల సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేస్తున్న పాత సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమా రీ రిలీజ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకోగా.. అంతకుమించి అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాకు మంచి క్రేజ్ అయితే దక్కింది.
పోకిరి సినిమా దాదాపు 1.75 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోగా ఇప్పుడు జల్సా సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో 3 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతకు ముందు రోజే తమ్ముడు సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలకు కూడా క్రేజ్ దక్కింది. ఇక ఇప్పుడు జల్సా 4K వెర్షన్ సినిమాకు మాత్రం ఊహించని స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త సినిమాలను తీసేసి మరి ఈ సినిమా షోలను వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి రాబోయే రోజుల్లో ఈ రీ రిలీజ్ లు ఇంకా ఎలాంటి వసూళ్లను అందుకుంటాయో చూడాలి.
Follow
Post a Comment