రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతగా లైక్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తనను కలుసుకునేందుకు ఎప్పుడు ఫ్యాన్స్ వచ్చినా కూడా వీలైనంత వరకు భోజనం పెట్టేలా చూస్తాడు. ఇక మొగల్తూరులో నేడు నిర్వహించిన సంస్మరణ సభ కోసం రాష్ట్ర నలువైపులా ఫ్యాన్స్ రావడంతో అందరికి ప్రత్యేకంగా భోజనాలు పెట్టించాడు.
ముందుగా ఫ్యాన్స్ ను పలకరిస్తూ.. అందరూ భోజనాలు చేసి వెళ్లండి అని అన్నాడు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దాదాపు 1 లక్షకు పైగా జనాలు వస్తారని గ్రహించి మరో 40 వేల మంది వచ్చినా వంటలు సిద్ధం చేసి ఉంచాలని ప్రభాస్ ఏర్పాట్లు చేయించారు. ఇక అందులో నాన్ వెజ్, వెజ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫొటోలు షేర్ చేసుకుంటున్నారు.
Follow
Post a Comment