చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోస్.. జల్సా రికార్డు బ్రేక్!


నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ మాస్ మూవీ చెన్నకేశవ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదలైంది. వివి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 20 సంవత్సరాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. 4K ప్రింట్‌లతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలకు USA నుండి విశేష స్పందన లభించింది.

లోకల్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలయ్య ఫ్యాన్స్ అదే తరహా ఎనర్జీతో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ యాక్షన్ డ్రామా ఊహించని విధంగా USA లో 38 లొకేషన్స్  నుండి $46K కంటే ఎక్కువ వసూలు చేసింది. దాదాపు 100కి పైగా షోలు ప్రదర్శించారు. రిపోర్ట్స్ ప్రకారం జల్సా రీ-రిలీజ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం ద్వారా ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డును సృష్టిస్తుంది.  మళ్లీ థియేటర్లలో పెద్ద స్క్రీన్‌లపై బాలయ్య మాస్‌ను అభిమానులు ఆస్వాదించారు.

Post a Comment

Previous Post Next Post