తమిళ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం "ఓ మై కడవులే"కి రీమేక్‌గా ఒరిజినల్ దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మిథిలా ఫాల్కర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అసలు కథలో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో అతిధి పాత్ర పోషించాడు.
ఇక్కడ తెలుగు వెర్షన్‌లో, వెంకటేష్ సేతుపతి పాత్రను తిరిగి పోషించనున్నారు. మొదట వెంకీ నటించేందుకు ఆసక్తిగా లేరని టాక్ వచ్చింది. కానీ వెంకీ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన విధానం నచ్చడంతో షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే అతని భాగం షూటింగ్ మరొక రోజు ముగిసింది. ఇదివరకే వెంకీ సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా చాలామంది యువ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు విశ్వక్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.
Follow
Post a Comment