కొన్నిసార్లు, కొంతమంది చిత్రనిర్మాతలు కొన్ని రీమేక్‌లను ఎందుకు ఎంచుకుంటారో ఎవరికీ అర్థం కాదు. తమిళ సూపర్‌స్టార్ అజిత్ వీరమ్ సినిమా తెలుగులోకి డబ్ అయి స్ట్రీమింగ్ సైట్‌లలో కూడా విడుదలైనప్పటికీ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దానిని కాటమరాయుడ పేరుతో రీమేక్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ చిత్రం రొటీన్ కంటెంట్‌తో తెలుగు బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. ఇక సల్మాన్ ఖాన్ కూడా అదే కథను రీమేక్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.
సల్మాన్ వీరమ్ హక్కులను తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ అతని తాజా చిత్రం “కిసీ కా భాయ్, కిసీ కి జాన్” అనేది సౌత్ ప్రాజెక్ట్‌కి రీమేక్ అని టాక్ ఉంది. కథను కాస్త అటు ఇటుగా మార్చేశారని వెంకీ తన సోదరులలో ఒకడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో, సల్మాన్ పోకిరి, రెడీ, బాడీగార్డ్ వంటి కొన్ని సూపర్ హిట్ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ సాధించాడు. అయితే మారుతున్న ట్రెండ్స్ అతని ప్లాన్‌లను దెబ్బ తీశాయి. మరి ఇప్పుడు నిజంగానే కాటమరాయుడు రీమేక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment