రణ్ బీర్.. తెలుగులో పాస్ అయ్యేలా ఉన్నాడు!


శనివారం రోజు జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోకుండా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. గణేష్ నిమజ్జనం కారణంగా పోలీస్ బందోబస్తు పూర్తిస్థాయిలో అందించలేము అని ఉన్నతాధికారులు తెలియజేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ తో మాత్రం చిత్ర యూనిట్ కొంతవరకు బాగానే ఆకట్టుకుంది. రణ్బీర్ కపూర్ మాట్లాడిన విధానం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది.

ముఖ్యంగా అతను ప్రత్యేకంగా తెలుగు నేర్చుకొని మరి మాట్లాడడం మెచ్చుకోదగిన విషయం. అందుకే ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి అంటూ బ్రహ్మోత్సవ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని నెక్స్ట్ బ్రహ్మాస్త్ర 2కి వచ్చేసరికి పూర్తిస్థాయిలో తెలుగు కూడా నేర్చుకుంటాను అని రన్బీర్ కపూర్ తెలియజేయడం విశేషం. 

ఒక విధంగా అతనే తెలుగు జనాలను ఈ మాటలతోనే ఆకట్టుకునేలా ఉన్నాడు అనిపిస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా మాత్రం కాస్త కంటెంట్ కనెక్ట్ అయినా కూడా తెలుగులో కూడా మంచి గుర్తింపును అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం సినిమాలో మూడు భాగాలుగా విభజించారు. మరి సెప్టెంబర్ 9న విడుదల కాబోయే పార్ట్ వన్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post