నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారతో సినిమాతో బాక్సాఫీస్ వద్ద పునరాగమనం చేసిన విధానం బాగానే వర్కౌట్ అయ్యింది. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి భారీగా ప్రాఫిట్స్ అంధించింది. ఇక బింబిసార ఎప్పుడు OTT ప్రీమియర్‌లకు వెళుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 రోజుల తరువాతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం అక్టోబర్ 7వ తేదీ నుండి ZEE5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుంది. అంటే సినిమా థియేటర్లలో విడుదలైన 2 నెలల తర్వాత OTTలో వస్తుంది. ఇంకా కళ్యాణ్ రామ్ టీమ్ అలాగే జీ 5 మేనేజ్‌మెంట్ OTT విడుదల తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించారు.
Follow
Post a Comment