ఆదిపురుష్ టీజర్ అప్పుడేనా?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి సినిమా ఆదిపురుష్ 2023 జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించబడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కానీ ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

అయితే అక్టోబర్ 3న టీజర్ విడుదలవుతుందని ఒక టాక్ అయితే ఉంది. టాక్ ప్రకారం ప్రభాస్ రావణ దహనం చేసేలా అయోధ్యలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఆ తర్వాత టీజర్ లాంచ్ చేస్తారని చెబుతున్నారు. ఇది జరిగితే, హైప్ ఖచ్చితంగా మాములు రేంజ్ లో ఉండదు. అయితే టీజర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. IMAX-3D ఫార్మాట్‌లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

Post a Comment

Previous Post Next Post