నాగబాబు చచ్చిపోతే ఏంటి.. చిరుని చితకొట్టిన క్షణం!


మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి ఆచార్య సినిమా డిజాస్టర్ పై అందరి ముందు ఒక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కంటెంట్ బాగుంటేనే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారని చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే దాని కన్నా వారిని పూర్తిగా ఆకట్టుకుంటేనే సరైన విజయాలు అందుతున్నట్లు చెబుతూ.. కంటెంట్ బాగోలేకపోతే ఏ సినిమా అయినా సరే తిప్పికొట్టడం కాయమని.. అందులో తాను కూడా ఒక బాధితుడినని ఆచార్య డిజాస్టర్ పై FDFS ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. 

ఆ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన మెగాస్టార్ తన చిన్ననాటి ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని కూడా అందరితో షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడు తన స్నేహితుడు ఎన్టీఆర్ రాము సినిమాకు తీసుకువెళ్లాడు. అప్పుడు నెల టిక్కెట్టుకు నాగబాబును తీసుకొని వెళ్ళాను. ఆ సమయంలో జనాలు ఒక్కసారిగా ఎగబడడంతో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక అదే సమయంలో ఆ సినిమాకు నాన్నగారు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత నాగబాబుకు చిన్న పిల్లవాడు ఏమైనా అయితే.. చచ్చిపోతే అంటూ నన్ను మొదటిసారి చితకొట్టేశారు అంటూ.. మెగాస్టార్ సరదాగా ఆ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు.

Post a Comment

Previous Post Next Post