ఈ శుక్రవారం రెండు భిన్నమైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలోనే వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో రూపొందిన బింబిసారా సినిమా తోపాటు దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమా పోటా పోటీగా విడుదల అవుతున్నాయి. అయితే నిన్నటి వరకు బింబిసార కు అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త ఎక్కువగానే ఉండగా ఇప్పుడు సీతారామం బుకింగ్ కూడా గంట గంటకు పెరుగుతూనే ఉన్నాయి.
బింబిసార మొత్తంగా 975కి పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఇక సీతారామం సినిమాను మొదట 700 థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు డిమాండ్ ను బట్టి 860కి పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ ఈవెంట్స్ కూడా కొంత హైప్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. బింబిసార యూనిట్ ఎన్టీఆర్ ను తీసుకువస్తే అంతకుమించి అనేలా ఆలోచించి వైజయంతి వారు ప్రభాస్ ను రంగంలోకి దింపారు. రెండు సినిమాలకు కూడా స్టార్ హీరోలు సపోర్ట్ చేయడం మంచి విషయం అనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాల్లో మొదటి రోజు ఏ సినిమా అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment