టాలీవుడ్ పాన్-ఇండియా సినిమాలలో అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా తన తండ్రి జన్మస్థలం అయిన అనంతపురం జిల్లా శింగనమల గ్రామానికి వచ్చి తండ్రి పుట్టినరోజు సందర్భంగా కంటి ఆసుపత్రికి 50 లక్షల విరాళం ఇచ్చాడు.
అయితే అక్కడే మీడియా ముందు అతను ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. నందమూరి హీరోతో సినిమా ఏప్రిల్ లేదా మే 2023 నుండి సెట్స్‌పైకి వస్తుందని అతను సూచించాడు. అంటే, “సలార్” విడుదలకు ముందే, తారక్‌తో KGF సృష్టికర్త ప్రాజెక్ట్ రోల్ అవుతుందని చెప్పాడు. ఇదిలా ఉంటే, #NTR30ని టేకాఫ్ చేసి పూర్తి చేయడానికి కొరటాల శివకు కేవలం 8 నెలల సమయం ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Follow
Post a Comment