బింబిసార ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు కామెంట్


నిర్మాత దిల్ రాజు బింబిసార సినిమాను రెండు రాష్ట్రాలలో కూడా సొంతంగా విడుదల చేసి మంచి ఆదాయాన్ని అందుకున్నాడు. గత కొంత కాలంగా  నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా వరుసగా నష్టాలు ఎదుర్కొంటున్న దిల్ రాజు మొత్తంగా బింబిసార సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అయితే అందిస్తోంది. అయితే ఈ క్రమంలో చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా ఒక పార్టీ కూడా ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు ఓటీటీ విడుదల డేట్ పై వస్తున్న పుకార్లపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంది అని చెప్పారు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్స్ రూమర్స్ అని తేలిపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5  సొంతం చేసుకుంది. నాన్ థియేట్రికల్ గా కూడా నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు మంచి ప్రాఫిట్ దక్కినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post