లాల్ సింగ్ చడ్డా.. చైతూకి ఎంతిచ్చారంటే?


అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత దారుణమైన డిజాస్టర్ ను చూసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం కూడా లాల్ సింగ్ చద్దా సినిమా పైనే ఉంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాలో నాగచైతన్య ఒక ప్రత్యేకమైన బాలరాజు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఆ పాత్ర తప్పకుండా కెరీర్ కు హెల్ప్ అవుతుంది అని నాగచైతన్య నమ్మకంతో చేశాడు. ఇక ఈ సినిమా కోసం అతను ఎంత పారితోషికం తీసుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే తన రెగ్యులర్ కంటే నాగచైతన్య కాస్త తక్కువగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది దాదాపు ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. కేవలం అమీర్ ఖాన్ తో నటిస్తే చాలు అని అనుకున్నా నాగచైతన్యకు ఒక విధంగా మంచి పారితోషికం దక్కింది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా అతని కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి
.

Post a Comment

Previous Post Next Post