జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవడంతో ఒక్కసారిగా ఈ కలయికపై రాజకీయ అంశాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. తెలంగాణలో మునుగోడులో ఉప ఎన్నికల సభ కోసం వచ్చిన అమిత్ షా ముందుగానే హైదరాబాదులో ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకోవడంతో ఒక్కసారిగా జనాల దృష్టిని ఆకర్షించారు. అయితే వీరి కలయికపై రాజకీయ పరమైన ఉద్దేశ్యం ఉంది అని కూడా కామెంట్స్ వచ్చాయి.
కానీ అందులో అలాంటివి ఏమి లేవు అని పలువురు బిజెపి నేతలు వివరణ ఇచ్చారు. కేవలం అతన్ని ఒక నటుడిగా అభినందించేందుకు కలిసినట్లుగా తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ ను మాత్రమే కాకుండా అమిత్ షా మరో ఇద్దరిని కూడా కలవాలని ప్లాన్ వేశారట. మొత్తంగా RRR మేయిన్ యూనిట్ ని కలవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళిని కలుద్దామని చెప్పినా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాంచరణ్ తన తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లినట్లుగా చెప్పాడట.
ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన నాయకులు కలవడానికి వస్తే స్టార్ సెలబ్రిటీలు ఏమాత్రం వెనుకడుగు వేయరు. రాజమౌళి రామ్ చరణ్ ఆ మీటింగ్ నుంచి కావాలనే తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ముఖ్యంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే అయితే ఇదే తరుణంలో రాజకీయ వివాదాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ అనవసరమైన రూమర్స్ కు తావు ఇవ్వకూడదు అని ఆయన వెనుకడుగు వేసినట్లు సమాచారం.
Follow
Follow
Post a Comment