దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక కథను అనుకుంటే దాన్ని ఎవరితో అయినా సరే తెరపైకి తీసుకురావాలని అనుకుంటాడు. ఒక హీరో రిజెక్ట్ చేసినంత మాత్రాన అక్కడే ఆగిపోకుండా వెంటనే మరొక హీరోకి కూడా కథను చెబుతూ ఉంటాడు. పోకిరి కథను రిజెక్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇక పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కథ నుంచి తప్పించుకున్నది కళ్యాణ్ రామ్ అని అలాగే ఎన్టీఆర్ అని కూడా టాక్ వచ్చింది.
మొదట ఈ కథకు బాక్సర్ అనే టైటిల్ అనుకున్న మాట వాస్తవమే. ఇక విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత కథలో టైటిల్ లో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన లిస్టులో మెగా హీరో రామ్ చరణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ తో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న పూరి బాక్సర్ కథ వినిపించాడు. కానీ చరణ్ కు అదేమీ అంత కొత్తగా అనిపించకపోవడంతో రిజెక్ట్ చేశాడు. ఇక బన్నీ ఆలోచనతోనే మొదట నత్థి క్యారెక్టర్ తో పూరి లైగర్ కథను డెవలప్ చేసాడు. ఇక బన్నీ కూడా లైగర్ కథను పెద్దగా ఇష్టపడలేదు. దీంతో చివరికి ఆ డిజాస్టర్ కథ విజయ్ దేవరకొండ చేయాల్సి వచ్చింది.
Follow
Post a Comment