లైగర్ సినిమా సంబంధించిన ప్రమోషన్ సమయంలోనే రిజల్ట్ ఏమిటో చాలా క్లారిటీగా అర్థమయింది. ఒక్క సాంగ్ వర్కౌట్ కాలేదు ట్రైలర్ అయితే అసలే నమ్మకంగా లేకపోవడంతో చాలామంది థియేటర్లకు వెళ్లలేదు. ఇక మొదటి రోజు సినిమా చూసిన తర్వాత నెగిటివ్ టాక్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. సినిమా విడుదలకు ముందు జనాలను థియేటర్లోకి రప్పించడానికి చేయాల్సిన జిమ్మిక్కులన్నీ చేసేసారు. విజయ్ దేవరకొండ ఎప్పటిలానే ఎమోషనల్ ట్యాగ్.. ఇక చార్మి ఇంటర్వ్యూలో ఏడవడం ఇలా చాలా చేశారు.
ఇక సడన్ గా అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఎందుకు ఇచ్చిందో అసలు విషయం ఎవరికి అర్థం కాలేదు. చాలా మీడియా సంస్థలు కూడా కాంట్రవర్సీ ట్వీట్ ను హైలెట్ చేశాయి. ఎప్పుడో ఏళ్ల క్రిందట అర్జున్ రెడ్డి సినిమాలో బూతు డైలాగు కర్మ ఇప్పటికి ఫలించింది అని ఆమె చెప్పడం ఇక దాన్నే అర్జున్ రెడ్డి అభిమానులు కౌంటర్ ఇవ్వడం ఇదంతా ఒక ప్రాసెస్ లా జరిగిపోతోంది. నిజానికి ఇక్కడ నమ్మిన వాళ్లు అయితే నిజంగా ఎర్రిపప్పలని కాకుండా ఎర్రి పప్పులని కూడా అనవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా మీద అప్పట్లో అనసూయ చేసిన కామెంట్ చాలా వైరల్ అయింది. అప్పటివరకు ఓకే అయ్యి ఉండవచ్చు కానీ ఆ తర్వాత విజయ్ సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా? వరల్డ్ ఫేమస్ లవర్ ఏమైంది.
మరో షాకింగ్ పాయింట్ ఏమిటి అంటే అనసూయ విజయ్ దేవరకొండ నిర్మించిన *మీకు మాత్రమే చెప్తా* సినిమాలో కూడా నటించిన విషయం తెలియనిది కాదు. ఇప్పటికి ఆమె కోపంగా ఉంటే మాత్రం ఆ సినిమాలో ఎందుకు నటిస్తుంది? ఇక ఇప్పుడు పనిగట్టుకుని ఎందుకు లైగర్ మీద కామెంట్ చేసింది అనేది నమ్మిన వారికే తెలియాలి. ఒక దాన్ని నమ్మరేమో అని మళ్లీ అనసూయ నెగిటివ్ కామెంట్స్ చేసినవారికి కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా కూడా జనాలు నమ్మడానికి ఇటీవల కాలంలో సెలబ్రిటీలు చేయాల్సిన వేషాలు అన్ని ఈ విధంగా వేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇది పక్కా లైగర్ మరో జిమ్మిక్ ప్రమోషన్.
Follow
Follow
Post a Comment