బింబిసార.. బీభత్సమైన ఓపెనింగ్స్ పక్కా!


కళ్యాణ్ రామ్ బింబిసారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న ధరకు తగిన డిమాండ్ అయితే ఉంది. మల్టీప్లెక్స్‌లలో మంచి బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

బింబిసార సినిమాకు దుల్కర్ సీతా రామం సినిమా రూపంలో పోటీ ఉన్నప్పటికీ బింబిసారకు అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి జస్ట్ నార్మల్ టాక్ వస్తే సరిపోదు. ఒక రేంజ్ టాక్ వస్తేనే ఆడియెన్స్ థియేటర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రిజల్ట్ తో సంబంధం లేకుండా మొదటి రోజు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ పక్కా అని అర్ధమవుతోంది. మరి రెండవ రోజు నుంచి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post