యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త విరామం తీసుకుని ఇటీవల ఫ్యామిలీతో టూర్ వెళ్లిన విషయం తెలిసిందే. నెక్స్ట్ కొరటాల శివతో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్న తారక్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ చిత్రం వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. బుచ్చిబాబు చెప్పిన స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది కానీ మళ్ళీ రీ వర్క్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఒకవేళ బుచ్చిబాబు ఆలస్యం చేసి ఎన్టీఆర్ కు ఫైనల్ స్క్రిప్ట్ నమ్మకంగా అనిపించకపోతే మాత్రం లిస్ట్ లోకి మరో దర్షకుడు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, వరుస బ్లాక్‌బస్టర్‌లను చూసిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల ఎన్టీఆర్‌ను కలిశాడు. చర్చలు కూడా జరుగుతున్నాయట. మరో రెండు సమావేశాల తర్వాత మంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈ లోపు బుచ్చిబాబు ఎన్టీఆర్ డేట్స్ తొందరగా దక్కించుకుంటాడో లేదో చూడాలి.
Follow
Post a Comment