మహేష్ బాబు కెరీర్ లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో ఒక్కడు సినిమా చాలా ప్రత్యేకమైనది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో పాత రికార్డులను చెరిపేసి మహేష్ బాబుకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత ఆ చిత్ర నిర్మాత ఒక్కడు సినిమాకు సీక్వెల్ రానున్నట్లు ఆ మధ్య ఒక కామెంట్ అయితే చేశాడు.
ఇక ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్లో అయితే ఒక్కడు సీక్వెల్ పనుల్లో కూడా బిజీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి నిర్మాత ఎమ్మెస్ రాజు మహేష్ బాబుతో కాకుండా మరొక హీరోతో ఒక్కడు సీక్వెల్ ను ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. పూర్తిగా వేరే నటీనటులతో టెక్నీషియన్లతో ఎమ్మెస్ రాజు ఒక్కడు 2 సినిమాను తెరపై తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందట. మరి మహేష్ బాబు లేని ఒక్కడు 2 సినిమాను జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.
Follow
Post a Comment