యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ థ్రిల్లర్ మూవీ కార్తికేయ 2 విడుదలకు సిద్ధమై చాలా కాలమయ్యింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అయితే కార్తికేయ 2 యూనిట్ మొత్తం ఈ మధ్యాహ్నం మీడియాను కలుస్తామని నిఖిల్ ట్వీట్ చేశాడు.
ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఒక రోజు వాయిదా పడుతుందట. అంటే ఆగస్ట్ 13న సినిమా రానుందని.. ప్రెస్ మీట్ పెట్టి వాయిదా గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే కొన్ని సినిమాల వలన నిఖిల్ సినిమా పలుమార్లు వాయిదా పడింది. నాగచైతన్య థాంక్యూ, కళ్యాణ్ రామ్ బాంబిసారతో పోటీ లేకుండా చేశారు. ఇక ఇప్పుడు నితిన్ మాచర్ల నియోజకవర్గం ఉందని మరోసారి ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందట. ప్రతీసారి నిఖిల్ మాత్రమే ఎందుకు తప్పుకోవాలి మిగతా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎందుకు తప్పుకోవడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
Follow
Post a Comment