కార్తికేయ 2.. కలర్స్ స్వాతి క్యారెక్టర్ పై సస్పెన్స్?


8 ఏళ్ల క్రిందట వచ్చిన కార్తికేయ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా వస్తున్న కార్తికేయ 2 ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఇది పక్కా సీక్వెల్ అని ఫ్రాంచెజ్ అయితే కాదు అంటూ ఇటీవల నిఖిల్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

అయితే ఈ క్రమంలో స్వాతి క్యారెక్టర్ ఉంటుందా లేదా అనే విషయంలో కూడా అతను ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశాడు. నిజానికి కార్తికేయ కథ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచి సీక్వెల్ కదా కూడా కొనసాగుతుంది అని ఆ తర్వాత మిస్టరీలను సాల్వ్ చేసుకుంటూ హీరో ద్వారక వరకు ఎలా వెళ్లాడు అనేది మిగతా కదా అని నిఖిల్ తెలియజేశారు. అయితే సినిమాలో స్వాతి ఉంటుందా లేదా అనే విషయం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి అని ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశాడు. ఇక ఇందులో ప్రధాన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post